రేపు సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన... షెడ్యూల్ ఇదే!
- సోమవారం సింగపూర్‌లో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్
- జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు
- ప్రముఖ సంస్థల సీఈవో, సీఎఫ్ఓలతో సమావేశం కానున్నారు
- డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతోనూ భేటీ కానున్న లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం (మే 11) నాడు ఆయన సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
షెడ్యూల్ ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఎంటీఐ కార్యాలయంలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం సింగపూర్‌లోని సన్ టెక్ సిటీలో వరుస భేటీలు జరపనున్నారు.
మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు కమోడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (సీఐసీ) సీఈవో, సీఎఫ్ఓలతో సమావేశమవుతారు. ఆ తర్వాత 2:30 నుంచి 3 గంటల వరకు డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధులతో లోకేష్ భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.